ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్ కరెక్ట్ గానే చెప్పారు: సుమన్
- ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి సభ
- ముఖ్య అతిథిగా వచ్చిన రజనీకాంత్
- చంద్రబాబుపై పొగడ్తల వర్షం
- రజనీకాంత్ పై వైసీపీ మంత్రుల ఆగ్రహం
- హైదరాబాద్ రూప శిల్పి చంద్రబాబేనన్న సుమన్
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను ఆగ్రహానికి గురిచేయడం తెలిసిందే. ఆ సభలో రజనీకాంత్ తన ప్రసంగంలో ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబును కూడా కీర్తించారు. హైదరాబాద్ అభివృద్ధి ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, చంద్రబాబు విజన్ గొప్పదని కొనియాడారు. అయితే వైసీపీ మంత్రులు, ఆ పార్టీ ఇతర నేతలు మాత్రం రజనీకాంత్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈ నేపథ్యంలో, సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. ఎన్టీఆర్ శతజయంతి సభలో రజనీకాంత్ చెప్పింది కరెక్టేనని అన్నారు. ఆయన వ్యాఖ్యల్లో తప్పుబట్టాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. కొన్ని తప్పులు జరిగినా, హైదరాబాద్ ను ఓ స్థాయికి తీసుకువచ్చింది, ఆధునిక హైదరాబాద్ నగర నిర్మాణంలో ముఖ్య శిల్పి చంద్రబాబేనని సుమన్ అన్నారు. ఇవాళ ఎంతోమందికి ఉద్యోగాలు లభించడం చంద్రబాబు చలవేనని తెలిపారు.
ఇప్పుడు కాలం మారిందని, చంద్రబాబు తర్వాత మరో ప్రభుత్వం వచ్చిందని అన్నారు. ఒకరు పోతారు, ఇంకొకరు వస్తారు, ఎత్తుపల్లాలు సహజం అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి చంద్రబాబు మంచి ముఖ్యమంత్రి అని, అయితే బ్యాడ్ టైమ్ వచ్చిందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకున్నారు... అంతేతప్ప, చంద్రబాబు చేసిన దాన్ని చేయలేదని ఎలా చెప్పగలం? అని సుమన్ ప్రశ్నించారు.