మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు

  • తన చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వివేక్
  • తన రాబోయే సినిమాపై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
  • లీగల్ నోటీసులపై ఎలాంటి సమాచారం లేదన్న సీఎంవో
తన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపించారు.  ఈ విషయాన్ని మంగళవారం వివేక్ తెలిపారు. ది కశ్మీర్ ఫైల్స్ తో పాటు తన రాబోయే సినిమా ది ఢిల్లీ ఫైల్స్ కూడా బెంగాల్లో హింసాకాండ ఆధారంగా తీస్తున్న సినిమా అని ఆమె చెబుతున్నారని, ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాను తీస్తున్న సినిమాలకు ఏ పార్టీ నిధులు సమకూర్చడం లేదన్నారు.

మరోవైపు, లీగల్ నోటీసులపై తమకు ఎలాంటి సమాచారం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. 'ది కేరళ స్టోరీ' ప్రదర్శనపై నిషేధం విధించాలని బెనర్జీ సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా మమత 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాపై మాట్లాడారు. సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా తీసిన సినిమా అదని ఆమె వ్యాఖ్యానించారు.


More Telugu News