ఈ సాయంత్రానికి బంగాళాఖాతంలో వాయుగుండం
- ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
- ఇది మరింత పుంజుకుంటోందన్న ఐఎండీ
- రేపటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపాను
- మే 11 వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనం
- క్రమేపీ దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనం
- బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వద్ద భూభాగంపైకి ప్రవేశించే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సముద్రాన్ని ఆనుకుని నిన్న ఏర్పడిన అల్పపీడనం, ఈ ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేటి సాయంత్రానికి ఇది వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఆ తర్వాత మరింత పుంజుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి రేపు (మే 10) తుపానుగా రూపాంతరం చెందుతుందని వెల్లడించింది.
ఈ తుపాను (మోచా) మే 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్కడ్నించి క్రమేపీ దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ వివరించింది.
ఈ తుపాను (మోచా) మే 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుందని, అక్కడ్నించి క్రమేపీ దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్-మయన్మార్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ వివరించింది.