జోఫ్రా ఆర్చర్ స్థానంలో ముంబై ఇండియన్స్ లోకి ఇంగ్లండ్ క్రికెటర్
- క్రిస్ జోర్డాన్ ను ఐపీఎల్ 2023 సీజన్ కు తీసుకున్నట్టు ప్రకటన
- ఈ సీజన్ కు పూర్తిగా దూరమైన జోఫ్రా ఆర్చర్
- కుడి మోచేయి గాయం తిరగబెట్టి ఉంటుందని అంచనా
ఎప్పుడూ లేని విధంగా ఐపీఎల్ 2023 సీజన్ ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలకు దూరమయ్యారు. ఐపీఎల్ సీజన్ కు ముందే గాయాలపాలైన వారు కొందరు అయితే, సీజన్ మధ్యలో గాయపడి తప్పుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలోకి ముంబై ఇండియన్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా వచ్చి చేరాడు.
జోఫ్రా ఆర్చర్ ఇప్పుడనే కాదు, గత కొన్ని ఏళ్లుగా గాయాలతోనే నెట్టుకొస్తున్నాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం ఐదు మ్యాచులు ఆడిన అతడు రెండే వికెట్లు తీశాడు. గత వారం చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ అతడికి చివరిది. ఆర్చర్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ జోర్డాన్ ను ఈ సీజన్ మొత్తానికి తీసుకున్నట్టు ముంబై ఇండియన్స్ తాజాగా ప్రకటించింది. అయితే, జోఫ్రా ఆర్చర్ గాయం గురించి మాత్రం వెల్లడించలేదు. 2021 నుంచి కుడి మోచేయి గాయంతో ఆర్చర్ బాధపడుతున్నాడు. అదే తిరగబెట్టి ఉంటుందని అంచనా. గతేడాది ఐపీఎల్ మొత్తానికి అతడు దూరంగానే ఉన్నాడు. రూ.2 కోట్లతో ముంబై ఇండియన్స్ అతడ్ని తీసుకోవడం గమనార్హం.