ఆఖరి ఓవర్లో బాదుడు... పంజాబ్ భారీ స్కోరు

  • ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • చివరి ఓవర్లో 21 పరుగుల నమోదు
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు
కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరులో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్లో షారుఖ్ ఖాన్ 1 సిక్స్, 2 ఫోర్లు కొట్టగా, హర్ ప్రీత్ బ్రార్ ఒక ఫోర్ బాదాడు. హర్షిత్ రాణా వేసిన ఆ ఓవర్లో పంజాబ్ కు 21 పరుగులు లభించాయి. 

19వ ఓవర్ అనంతరం 158/7 స్కోరుతో ఉన్న పంజాబ్ కింగ్స్... 20వ ఓవర్ ముగిసేసరికి 179 పరుగులు నమోదు చేసింది. షారుఖ్ ఖాన్ 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 21 పరుగులు, హర్ ప్రీత్ బ్రార్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 

అంతకుముందు, కెప్టెన్ శిఖర్ ధావన్ 57 పరుగులు చేయగా, జితేశ్ శర్మ 21, రిషి ధావన్ 19 పరుగులు చేశారు. ప్రభ్ సిమ్రన్ (12), భానుక రాజపక్స (0), లియామ్ లివింగ్ స్టోన్ (15), శామ్ కరన్ (4) ఆకట్టుకోలేకపోయారు. 

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవరి 3, హర్షిత్ రాణా 1, సుయాశ్ శర్మ 1, కెప్టెన్ నితీశ్ రాణా 1 వికెట్ తీశారు.


More Telugu News