మధ్యప్రదేశ్ ఆర్మీ వార్ కాలేజీ క్యాంపస్‌లో పులి సంచారం.. డ్రోన్లతో వెతుకులాట
- మోవ్‌లోని కాలేజీ క్యాంపస్ లో భయాందోళన పరిస్థితులు
- పులి కోసం క్విక్ రెస్పాన్స్, అటవీ సిబ్బంది గాలింపు
- సీసీటీవీ ఫుటేజీ కెమెరాల్లో కనిపించిన పులి
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లా మోవ్‌లోని ఆర్మీ వార్ కాలేజ్ క్యాంపస్‌లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడ భయాందోళన పరిస్థితులు కనిపించాయి. క్విక్ రెస్పాన్స్ టీమ్, అటవీ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో పులి కోసం వెతికినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.
క్యాంపస్‌లోని గేట్ నెంబర్ 3 వద్ద ఆదివారం, సోమవారం రాత్రి పులి తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కనిపించాయి.
పులి కోసం వెతుకుతున్నామని, కానీ ఇంకా దాని జాడ తెలియరాలేదని ఓ ఆర్మీ వార్ కాలేజ్ అధికారి తెలిపారు. క్యాంపస్‌లోని దాదాపు అన్ని ప్రాంతాలు పొదలతో నిండుగా ఉన్నాయని తెలిపారు. పులిని గుర్తించేందుకు డ్రోన్లతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గడిచిన అయిదేళ్ళలో కోరల్, మాండులో పులులు కనిపించాయని, కానీ ఈ ప్రాంతంలో పులి కనిపించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.