సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

  • జగన్ ను కలుసుకున్న సిక్కు మత పెద్దలు
  • సిక్కు మైనార్టీ విద్యా సంస్థ ఏర్పాటుకు సాయమందిస్తామన్న సీఎం
  • గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపుకు అంగీకారం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ముఖ్యమంత్రితో వారు పలు అంశాలపై చర్చించారు. వారి విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించిన జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇవ్వడానికి అంగీకరించారు. గురుద్వారాల్లో పూజారులైన గ్రంధీలకు పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. సిక్కు మైనార్టీ విద్యాసంస్థ ఏర్పాటుకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపుకు అంగీకరించారు. సిక్కులు పారిశ్రామికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.


More Telugu News