ఒక్క సెషన్‌లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
- చివరి సెషన్లో రూ.రూ.273.8 లక్షల కోట్లుగా ఇన్వెస్టర్ల సంపద
- ఈ రోజు సెషన్ ముగిసేసరికి రూ.276.1 లక్షల కోట్లకు జంప్
- 52 వారాల గరిష్ఠానికి 191 స్టాక్స్
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ముగింపుతో పోలిస్తే సెన్సెక్స్ నేడు 700 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది. ఈ ఒక్క సెషన్ లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. చివరి సెషన్ లో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.273.8 లక్షల కోట్లు కాగా, ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.276.1 లక్షల కోట్లకు పెరిగింది. అంటే సింగిల్ సెషన్ లో ఇన్వెస్టర్ల సంపద అక్షరాలా రూ.2.3 లక్షల కోట్లకు పెరిగింది. 191 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.