దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 710 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 195 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతం వరకు పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా లాభపడ్డాయి. ఈ ఉదయం పాజిటివ్ గా ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో పాటు, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడం మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 710 పాయింట్లు లాభపడి 61,764కి ఎగబాకింది. నిఫ్టీ 195 పాయింట్లు పుంజుకుని 18,264కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.92%), టాటా మోటార్స్ (4.82%), బజాజ్ ఫైనాన్స్ (4.21%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.32%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.89%). 

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-0.89%), ఎల్ అండ్ టీ (-0.57%), నెస్లే ఇండియా (-0.21%).


More Telugu News