'అన్నీ మంచి శకునములే' సాంగ్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్!
- నందినీ రెడ్డి నుంచి 'అన్నీ మంచి శకునములే'
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
- సంతోష్ జోడీకట్టిన మాళవిక నాయర్
- ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల
సంతోష్ - మాళవిక నాయర్ జంటగా ప్రియాంక దత్ - స్వప్న దత్ నిర్మించిన 'అన్నీ మంచి శకునములే' సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం సాంగ్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. అశ్వనీదత్ తో పాటు అల్లు అరవింద్ .. రాఘవేంద్రరావు దీనికి హాజరయ్యారు.
ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "సంతోష్ - మాళవిక నాయర్ సినిమాలను ఇంతకుముందు నేను చూశాను. ఇది చిన్న సినిమానే అయినా గట్టిగానే ఖర్చు చేశారని అంటున్నారు. ఈ సినిమా మంచి లాభాలను రాబట్టాలని కోరుకుంటున్నాను. నందినీ రెడ్డికి మంచి పేరు తీసుకుని రావాలని ఆశిస్తున్నాను" అన్నారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. " నందినీ రెడ్డి ఈ సినిమాకి 'అన్నీ మంచి శకునములే' అనే టైటిల్ పెట్టింది. అలాంటి ఈ సినిమాకి వెళ్లడానికి శకునాలు చూసుకోవలసిన అవసరం లేదు. ఇందాక పాట చూశాను .. 'పెళ్లి సందడి'లో పాట చూసినంత సంతోషంగా ఉంది. ఆ సినిమా ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్ కావాలని ఆశిస్తున్నాను" అన్నారు.
ఇక అశ్వనీదత్ మాట్లాడుతూ .. "ఇంతకుముందు చాలా ఫంక్షన్స్ కి వెళ్లాను గానీ, నా జీవితంలో మరిచిపోలేని గొప్ప ఫంక్షన్ ఇది. 49 ఏళ్ల క్రితం సినిమా తీయాలనే ఉద్దేశంతో మద్రాసు బయల్దేరితే, నవయుగ ఫిలిమ్స్ వారు పిలిచి నాకు ఒక మాట చెప్పారు. మద్రాసులో అల్లు రామలింగయ్య గారి అబ్బాయి అరవింద్ గారు ఉంటారు, అతనికున్నన్ని తెలివితేటలను మేము ఎక్కడా చూడలేదు .. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకో అంతా మంచే జరుగుతుందని చెప్పారు. అప్పటి నుంచి లాభనష్టాలకు అతీతంగా మా ప్రయాణం కొనసాగుతూనే ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.