బంగాళాఖాతంలో దిశ మార్చుకోనున్న 'మోచా' తుపాను!

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం 
  • నేడు అల్పపీడనం... రేపటికి వాయుగుండం
  • ఆపై తుపానుగా బలపడుతుందని అంచనా
  • బంగ్లాదేశ్ వద్ద తీరం దాటుతుందని తాజా అంచనాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. ఇది నేడు అల్పపీడనంగా మారింది. రేపు (మే 9) వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుంది. తుపానుగా మారితే దీన్ని మోచా అని పిలవనున్నారు. వివిధ వాతావరణ సంస్థల అంచనా ప్రకారం 'మోచా' తుపాను మయన్మార్ తీరాన్ని తాకుతుందని తొలుత పేర్కొన్నారు. 

కానీ, తాజా అంచనాల ప్రకారం ఈ తుపాను దిశ మార్చుకుని ఏపీ తీరానికి చేరువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి, అక్కడ్నించి బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేటు వాతావరణ సంస్థ విండీ వాతావరణ నమూనాలు చెబుతున్నాయి. 

ఈ నెల 15 నాటికి ఇది తీరం దాటుతుందని అంచనా. దీని ప్రభావం ఏపీపై ఉండకపోవచ్చని వాతావరణ సంస్థలు వెల్లడించాయి.


More Telugu News