బాలీవుడ్ లో లోపం ఏమిటనే ప్రశ్నకు రణబీర్ కపూర్ సమాధానం ఇదే!
- బాలీవుడ్ లో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయిందన్న రణబీర్ కపూర్
- రీమేక్ సినిమాల ప్రభావం కూడా పడుతోందని వ్యాఖ్య
- కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శ
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆధిపత్యం బాలీవుడ్ దే. మన దేశంలోని ఇతర సినీ పరిశ్రమలన్నీ బాలీవుడ్ తర్వాతే. అయితే కొన్నేళ్లుగా బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారుతూ వస్తోంది. బాలీవుడ్ చిత్రాలు ఆశించినంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశాలతో కూడిన చిత్రాలు బాలీవుడ్ లో రావడం లేదు. ఇదే సమయంలో సౌత్ చిత్రాలు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఇరగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా బాలీవుడ్ పై విమర్శలు గుప్పించారు.
బాలీవుడ్ లో ఉన్న లోపం ఏమిటని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా... గత 15 - 20 ఏళ్లుగా బాలీవుడ్ సినిమాల్లో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయిందని చెప్పారు. రీమేక్ సినిమాల వల్ల కూడా హిందీ చిత్ర పరిశ్రమ గందరగోళానికి గురవుతోందని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా తక్కువ మంది యాక్టర్లు ఉన్నారని... కొత్త వారికి అవకాశం రావడం లేదని చెప్పారు. కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. కొత్తవారికి అవకాశాలు లభిస్తేనే మార్పు వస్తుందని చెప్పారు. కొత్త వారికి ఛాన్సులు ఇస్తేనే బాలీవుడ్ కు పూర్వ వైభవం వస్తుందని అన్నారు.