ఏమి చూడాలన్నది ప్రజల ఇష్టానికి వదిలేయాలి: ఖుష్బూ

  • తమిళనాడులో కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనల నిషేధం
  • తమిళనాడు థియేటర్ల సంఘం స్వీయ నిర్ణయం
  • దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఖుష్బూ సుందర్
ప్రజలు ఏమి చూడాలన్నది వారి ఇష్టానికి విడిచిపెట్టాలని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ అభిప్రాయపడ్డారు. ‘ద కేరళ స్టోరీ’ సినిమా పట్ల తమిళనాడులో వస్తున్న వ్యతిరేకతను ఆమె ఖండించారు. వివాదాస్పదమైన ఈ సినిమా ప్రదర్శనను స్వచ్చందంగా నిలిపివేయాలని తమిళనాడు రాష్ట్రంలోని థియేటర్లు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఖుష్బూ సుందర్ స్పందించారు. ఈ సినిమా ఈ నెల 5న విడుదల కావడం తెలిసిందే. 

‘‘తమిళనాడు ప్రభుత్వం కేరళ స్టోరీస్ ప్రదర్శనల రద్దుకు కుంటి సాకులు చెబుతోంది. ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ప్రజలు తెలుసుకునేలా చేసినందుకు ధన్యవాదాలు. కేరళ స్టోరీస్ నిషేధం కోసం పోరాడే వారిని ఏమి భయపెడుతుందో ఆశ్చర్యంగా ఉంది. నిర్మొహమాటంగా నిజం చెప్పడమా లేక సంవత్సరాలుగా తెలియకుండా లేదా తెలిసినా మౌనంగా నిజంలో భాగం అయ్యామన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నందుకా?’’ అని ఖుష్బూ ట్వీట్ చేశారు. భద్రతా కారణాలను చూపిస్తూ మే 7 నుంచి కేరళ స్టోరీస్ సినిమా ప్రదర్శనలను నిలిపివేయాలని థియేటర్ల సంఘం నిర్ణయించడం గమనార్హం.


More Telugu News