యువతులు ‘ది కేరళ స్టోరీని’ చూడాలని సూచించిన వ్యక్తిపై దాడి

  • రాజస్థాన్‌లో వెలుగు చూసిన ఘటన
  • వాట్సాప్ స్టేటస్‌తో యువతులకు ది కేరళ స్టోరీపై వ్యక్తి సూచన 
  • బాధితుడు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభం
‘ది కేరళ స్టోరీ’ సినిమా చూడమని యువతులకు సలహా ఇచ్చిన ఓ రాజస్థాన్ వ్యక్తిపై కొందరు దాడికి దిగారు. శనివారం ఈ ఘటన జరిగింది. ది కేరళ స్టోరీ చూడాలంటూ బాధితుడు తన వాట్సాప్ స్టేటస్‌లో సలహా ఇచ్చాడు. ఆ రోజు రాత్రి అతడు ఇంటికి తిరిగొస్తుండగా ముగ్గురు యువకులు అతడిని అడ్డగించారు. ఆ సినిమాను ప్రశంసించి తమ వర్గాన్ని అవమానించావని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు అతడిపై దాడి చేశారు. బాధితుడు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

‘ది కేరళ స్టోరీ’ దేశవ్యాప్తంగా కాంట్రవర్సికీ తెరలేపిన విషయం తెలిసిందే. కేరళలో 32 వేల మంది హిందూ, క్రిస్టియన్ మహిళలను ఇస్లాంలోకి మార్చి ఐసిస్ టెర్రరిస్టు సంస్థలో చేర్చారని పేర్కొనడం వివాదానికి దారి తీసింది.


More Telugu News