కృతి శెట్టి నాకంటే బాగా మాట్లాడుతోందే: చైతూ

  • చైతూ తాజా చిత్రంగా రూపొందిన 'కస్టడీ'
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న చైతూ 
  • కీలకమైన పాత్రను పోషించిన అరవింద్ స్వామి 
  • ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానన్న చైతూ

నాగచైతన్య హీరోగా రూపొందిన 'కస్టడీ' సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో చైతూ మాట్లాడుతూ .. "వెంకట్ ప్రభు గారు ఈ కథ చెప్పగానే ఆయనను హగ్ చేసుకున్నాను. అంతగా ఈ కథ నాకు నచ్చింది. ఈ కథ ఇచ్చిన కాన్ఫిడెంట్ తోనే ఈ రోజున నేను ఇక్కడ నిలబడ్డాను" అని అన్నాడు. 

"వెంకట్ ప్రభుగారు తమిళంలో ఎన్నో మాస్ సినిమాలు చేశారు. అజిత్ .. సూర్య .. శింబు .. కార్తితో అక్కడ పెద్ద హిట్లు ఇచ్చారు. బడ్జెట్ పరంగా ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి గారు నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టారు. అరవింద్ స్వామిగారు ఈ కథకి ఓకే చెప్పగానే నాకు మరింత నమ్మకం పెరిగింది. ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకునే అవకాశం నాకు ఈ సినిమాతో లభించింది" అని చెప్పాడు. 

"శరత్ కుమార్ .. ప్రియమణి వంటి సీనియర్స్ తో చేయడం హ్యాపీగా ఉంది. కృతి ప్రోగ్రెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నాకంటే తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమె కెరియర్ ఈ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉండనుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. 



More Telugu News