టాస్ ఓడిన సన్ రైజర్స్.. అసలే సొంతగడ్డ కూడా కాదు!

  • తాజా సీజన్ లో 10వ మ్యాచ్ ఆడుతున్న సన్ రైజర్స్
  • నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్
  • జైపూర్ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ తాజా సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 6 మ్యాచ్ ల్లో ఓడిపోయిన జట్టు... సన్ రైజర్స్ హైదరాబాద్. పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్న సన్ రైజర్స్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో ఆడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు జైపూర్ ఆతిథ్యమిస్తోంది. సొంతగడ్డ హైదరాబాదులోనే పరాజయాలు చవిచూసిన సన్ రైజర్స్ ఇవాళ జైపూర్ లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

ఇప్పటివరకు 3 మ్యాచ్ లే నెగ్గిన సన్ రైజర్స్ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు దాదాపు లేనట్టే! ఈ టోర్నీలో సన్ రైజర్స్ ఇవాళ్టి మ్యాచ్ తో కలిపి ఇంకా 5 మ్యాచ్ లు ఆడాలి. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ లోనూ గెలిచి, అదే సమయంలో టాప్-4 జట్లు కూడా కొన్ని మ్యాచ్ లు ఓడిపోతే తప్ప సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలు తక్కువే. 

కాగా, నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ జట్టులో కొన్ని మార్పులు చేశారు. వరుసగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ ను పక్కనబెట్టి, గ్లెన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక వివరాంత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. 

అంతేకాదు, ఈ మ్యాచ్ ద్వారా మరో స్టార్ క్రికెటర్ కూడా ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. అతడెవరో కాదు... ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ జో రూట్. ఇటీవల ఆటగాళ్ల వేలంలో రూట్ ను చవకగా కొనుక్కున్న రాజస్థాన్ రాయల్స్ ఇవాళ సన్ రైజర్స్ పై అతడిని బరిలో దింపుతోంది. 

అన్నదమ్ముల పోరులో ఎవరు గెలిచారంటే...

అహ్మదాబాద్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో జట్టును టైటాన్స్ బౌలర్లు 171-7 స్కోరుకే కట్టడి చేశారు. 

ఓ దశలో కైల్ మేయర్స్ (48), క్వింటన్ డికాక్ (70) విజృంభణతో గెలుపుపై కన్నేసినట్టు కనిపించిన లక్నో సూపర్ జెయింట్స్ ఆ తర్వాత వడివడిగా వికెట్లు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. కట్టుదిట్టమైన బంతులతో లక్నో ఆశలకు కళ్లెం వేశాడు. షమీ 1, రషీద్ ఖాన్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. 

ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించగా, లక్నో జట్టుకు హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా కెప్టెన్సీ వహించడం తెలిసిందే.


More Telugu News