టాస్ గెలిచిన అన్నయ్య... తమ్ముడి జట్టుకు బ్యాటింగ్... ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం
- ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్
- తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్
- గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా
- లక్నో జట్టుకు కెప్టెన్ గా కృనాల్ పాండ్యా
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కృనాల్
- తొలుత బ్యాటింగ్ చేయనున్న హార్దిక్ సేన
ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్ కాగా... మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ఓ విశిష్టత ఉంది.
గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అని తెలిసిందే. మరి లక్నో సూపర్ జెయింట్స్ కు ఈ మ్యాచ్ లో కెప్టెన్సీ వహిస్తోంది ఎవరో కాదు... హార్దిక్ పాండ్యా అన్నయ్య కృనాల్ పాండ్యానే. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడంతో లక్నో సూపర్ జెయింట్స్ కు కృనాల్ పాండ్యా సారథ్యం చేపట్టాడు. అన్నదమ్ములు ఇలా వేర్వేరు జట్లకు కెప్టెన్సీ వహించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే ప్రథమం.
నేటి మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన కృనాల్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. లక్నో జట్టులో విధ్వంసక ఆటగాడు క్వింటన్ డికాక్ చేరడంతో కాస్త బలోపేతం అయినట్టు కనిపిస్తోంది.