మణిపూర్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం విమానం పంపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
- మణిపూర్ లో తీవ్ర ఉద్రిక్తతలు
- ఎస్టీ హోదా అంశంపై గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు
- ఇంఫాల్ ఎన్ఐటీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు
- 24×7 హెల్ప్ లైన్ ప్రకటించిన తెలంగాణ పోలీసులు
గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో తెలుగువారు చిక్కుకుపోవడం తెలిసిందే. 150 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఇంఫాల్ లోని ఎన్ఐటీలో దయనీయ స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం ప్రత్యేక విమానాన్ని ఇంఫాల్ పంపిస్తోంది. ఈ విమానం రేపు ఉదయం ఇంఫాల్ చేరుకోనుంది.
కాగా, మణిపూర్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారి కోసం తెలంగాణ పోలీసులు 24×7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. మణిపూర్ లోని తెలుగు పౌరులు సాయం పొందేందుకు 91 79016 43283 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ డీఐజీ సుమతి ఆధ్వర్యంలో పనిచేయనుంది.
ఇతరత్రా సందేహాలు, వివరాల కోసం dgp@tspolice.gov.in ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
మణిపూర్ లో గిరిజనేతరులైన మెయితీలకు ఎస్టీ హోదా అంశం రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలకు కారణమైంది. మొయితీలకు ఎస్టీ హోదా అంశాన్ని గిరిజనులైన కుకీలు, నాగాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.