ఐపీఎల్ హిస్టరీలో రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డ్!

  • ముంబయి ఇండియన్స్‌ను ఐదుసార్లు గెలిపించిన రోహిత్ 16 సార్లు డకౌట్
  • చెన్నైతో జరిగిన మ్యాచ్ లో మూడో బంతికే డకౌట్
  • దీపక్ చాహర్ బౌలింగ్ లో జడెజా చేతికి చిక్కిన ముంబయి కెప్టెన్
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముంబయి ఇండియన్స్ జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్... బ్యాటింగ్ పరంగా ఓ అవాంఛనీయ రికార్డును కూడా నమోదు చేశాడు.

ఐపీఎల్-2023 సీజన్ లో చెపాక్ వేదికగా చెన్నైతో మ్యాచ్ లో రోహిత్ శర్మ మూడో బంతికి డకౌట్ గా పెవిలియన్ చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్ లో ల్యాప్ షాట్ ను ఆడేందుకు ప్రయత్నించి బ్యాక్ వర్డ్ పాయింట్లో ఉన్న జడేజా చేతికి చిక్కాడు.

ఈ క్రమంలో ఐపీఎల్ లో 16 సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాత ముగ్గురు ప్లేయర్లు 15 సార్లు డకౌట్ అయినవాళ్లు ఉన్నారు. దినేశ్ కార్తీక్, మన్ దీప్ సింగ్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్... ఈ ముగ్గురు పదిహేనుసార్లు డకౌట్ అయ్యారు. ఆ తర్వాత 14 సార్లు డకౌట్ తో అంబటి రాయుడు ఉన్నాడు.


More Telugu News