పన్ను రాబడిలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్: మంత్రి హరీశ్ రావు
- కేసీఆర్ పారదర్శక పాలనతో రాబడిలో వృద్ధి రేటు
- 2022-23లో రూ.72,564 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యం చేరుకున్న వాణిజ్య శాఖ
- సంక్షేమ పథకాల అమలులో వాణిజ్య శాఖ కీలకమని వ్యాఖ్య
గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర సొంత రాబడుల రేటులో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ పారదర్శక పాలనతోనే ఈ తరహా వృద్ధి రేటు సాధ్యమైందని చెప్పారు. హైదరాబాద్ శివారులోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ మేథోమధన సదస్సుకు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదాయ వనరుల పెంపుదలపై సదస్సులో చర్చించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2022-23లో రూ.72,564 కోట్ల పన్నుల వసూలుతో లక్ష్యాన్ని సాధించిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన ఖర్చు కోసం ధనాన్ని సమీకరించడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలకమన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల కోట్లకు పైగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో పన్ను ద్వారా వచ్చే ప్రతి రూపాయి అట్టడుగు వర్గాల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు.