మీకు డెస్టినీపై నమ్మకం లేదా? అయితే ఈ వీడియో చూడండి.. మిమ్మల్ని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది!: ఆనంద్ మహీంద్రా
- వైరల్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- ఫుట్‌పాత్‌పై నిల్చున్న వ్యక్తి పక్కకెళ్లగానే దూసుకొచ్చిన కారు
- ఐదు క్షణాలు ఆలస్యం చేసి ఉంటే ప్రాణాలు పోయేవే
‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అని అంటారు. కర్మ సిద్ధాంతాన్ని, విధిని నమ్మేవాళ్లు ఈ మాటతో ఏకీభవిస్తారు. మనం తెలిసో, తెలియకో చేసే ప్రతి పని వెనుక ఓ బలమైన కారణం ఉంటుందని గట్టిగా విశ్వసిస్తారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?.. కింద ఉన్న వీడియోను ఓ సారి చూడండి. ఎందుకో అర్థమవుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ‘‘మీకు కర్మ లేదా విధిపై నమ్మకం లేకపోతే.. ఈ వీడియో మిమ్మల్ని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది!’’ అని ఆయన రాసుకొచ్చారు.
ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై నిల్చొని ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడో, ఎవరి కోసం ఎదురు చూశాడో, ఆ క్షణం ఏమనిపించిందో.. అక్కడి నుంచి చిరాగ్గా పక్కకి వెళ్లిపోయాడు. ఒక ఐదు అడుగులు నడిచి ఉంటాడేమో.. ఓ కారు అతి వేగంతో వచ్చి.. అంతకుముందు ఆ వ్యక్తి నిలుచున్న చోట స్తంభాన్ని ఢీకొట్టింది.
కేవలం ఐదే సెకెన్లలో ఇదంతా జరిగిపోయింది. ఆ వ్యక్తి అక్కడే నిలుచుని ఉన్నా, మధ్యలో స్తంభం అడ్డులేకున్నా.. ప్రాణాలు పోయేవే. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.