చిన్న జీవి.. చిరుతలు కూడా ఏమీ చేయలేవు..!
- మూడు చిరుతలతో పోరాడుతున్న హనీ బాడ్జర్
- దీని ప్రత్యేకమైన శరీర నిర్మాణమే దీనికి రక్షణ
- వెల్లడించిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా
చిరుత పులి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భూమిపై వేటలో చిరుత పులి, ఆకాశం నుంచి వేటలో గద్దను మించినవి లేవు. వేటాడిన జంతువుతో చెట్టు చిటారు కొమ్మపైకి చేరి ఆకలి తీరే వరకు తినగలదు చిరుత. అలాంటి చిరుత పులులు హైనాలు వస్తే మాత్రం దూరంగా వెళ్లిపోతాయి.
అలాగే, హనీ బాడ్జర్ అనే జంతువు కూడా శత్రువుల ముందు లొంగిపోదు. చిరుత పులులు కూడా దీన్ని ఏమీ చేయలేవు. పైగా ఏ జంతువును చూసినా ఇది ఏ మాత్రం భయపడిపోదు. ఎందుకనే విషయాన్ని ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తెలియజేశారు. హనీ బాడ్జర్ ఓ మూడు చిరుత పులులతో పోరాడుతున్న వీడియో క్లిప్ ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
హనీ బాడ్జర్ అనేది భయమే లేని జంతువు. వాటి చర్మం చాలా మందంగా ఉంటుంది. పైగా చాలా లూజ్ గా (వదులుగా) ఉంటుంది. దాంతో దాడుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలవు. మెడ దగ్గర పట్టుకున్నా సరే అవి విడిపించుకోగలవు. పాముల విషం, తేళ్ల కాటుల నుంచి వీటికి రక్షణ ఉంటుంది’’ అని నందా వివరించారు. వీడియో చూస్తే హనీ బాడ్జర్ కు ఎంత రక్షణ ఉందో అర్థం చేసుకోవచ్చు.