తొలిరోజే ‘ది కశ్మీర్ ఫైల్స్’ను దాటేసిన ‘ది కేరళ స్టోరీ’
- ఆదా శర్మ ప్రధాన పాత్రలో చిత్రం
- నిన్న దేశ వ్యాప్తంగా విడుదల
- తొలి రోజు మంచి కలెక్షన్లు రాబట్టిన సినిమా
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోస్టర్స్, ట్రైలర్ తోనే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. లవ్ జిహాద్ పేరిట కేరళలో 32 వేల మందికిపైకా అమాయక యువతులను ట్రాప్ చేసి ఐసిస్ లో చేర్చారని చెబుతూ తీసిన ఈ చిత్రంపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సినిమాను నిషేధించాలంటూ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కాంగ్రెస్, వామపక్షాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ, సినిమా విడుదలను అపేందుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు.
దాంతో నిన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇది అంచనా మాత్రమే. వాస్తవ వసూళ్లు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారాంతంలో కలెక్షన్లు ఇంకా పెరగొచ్చని అంటున్నాయి. చిన్న బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా భారీ విజయం సొంతం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్ చిత్రం తొలి రోజు రూ. 3.55 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ, తర్వాత రోజు రోజుకు కలెక్షన్లు పెరిగాయి.