విడాకులు వచ్చాయన్న సంబరంలో యువకుడి సాహస క్రీడ.. జీవితం తలకిందులు!
- బ్రెజిల్‌లో వెలుగు చూసిన షాకింగ్ ఘటన
- ఆనందంతో బంగీ జంప్ కు ప్రయత్నించిన యువకుడు
- కాళ్లకున్న తాడు తెగడంతో 70 అడుగుల ఎత్తుపై నుంచి పడిపోయిన వైనం
- మెడ, వెన్నుక విరగడంతో ఆసుపత్రి పాలు
- జీవితం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని మీడియాతో వ్యాఖ్య
విడాకులు వచ్చేశాయన్న సంబరంలో సాహసక్రీడలో పాల్గొన్న ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. 70 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో అతడి మెడ, వెన్నుముక విరిగి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇటీవల బ్రెజిల్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. రాఫేల్ డాస్ సొంటోస్ అనే 22 ఏళ్ల యువకుడికి ఈ ఏడాది జనవరిలో విడాకులు మంజూరయ్యాయి. దీంతో, సంబరపడిపోయిన అతడు జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించాలనుకున్నాడు.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11న కాంపో మాగ్రో ప్రాంతంలోని ఓ సరస్సుకు వెళ్లాడు. అక్కడున్న వంతెన పైనుంచి బంగీ జంప్ ను ప్రయత్నించాలని అతడికి అనిపించింది. దీంతో, అతడు తన కాళ్లకు తాడు కట్టుకుని బ్రిడ్జిపై నుంచి దూకాడు. దురదృష్టవశాత్తూ కాళ్లకు ఉన్న తాడు తెగిపోవడంతో అతడు 70 అడుగుల ఎత్తు నుంచి తలకిందులుగా పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి మెడ, వెన్నుముక విరిగిపోయాయి. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి కోలుకుంటున్న అతడు తన జీవితం పూర్తిగా మారిపోయిందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. ‘‘ఒకప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. ప్రస్తుతం నా పరిస్థితి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.