ఇక జీమెయిల్‌లోనూ బ్లూ టిక్ మార్క్!
- ఈమెయిల్ అకౌంట్ల వెరిఫికేషన్ కోసం గూగుల్ కొత్త ఫీచర్
- ఫిషింగ్ అటాక్స్ నుంచి వినియోగదారులకు రక్షణగా నిలవనున్న టిక్ మార్క్
- పెయిడ్ కస్టమర్లు, వ్యక్తిగత ఈమెయిల్ అకౌంట్స్ గలవారికీ ఉచితంగా సర్వీసు
ఫిషింగ్ అటాక్స్ నుంచి తన వినియోగదారులను కాపాడుకునేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. ఇకపై జీమెయిల్ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది. వెరిఫైడ్ ఈమెయిల్ అకౌంట్లకు ఈ టిక్ మార్కు ఇస్తామని తాజాగా వెల్లడించింది. ఈమెయిల్ పంపిన వారి పేరు పక్కనే ఈ మార్కు కనిపిస్తుందని పేర్కొంది.
సంస్థ ప్రకటన ప్రకారం, గూగుల్ వర్క్‌స్పేస్ కస్టమర్లు, లెగసీ జీ సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్లు, వ్యక్తిగతంగా వెరిఫైడ్ జీమెయిల్ అకౌంట్ కలిగిన వారికి ఈ టిక్ మార్కును కేటాయిస్తారు. 2021లో గూగుల్ ప్రారంభించిన బ్రాండ్ ఇండికేటర్స్ ఫర్ మెసేజ్ ఐడెంటిఫికేషన్ ఫీచర్‌కు (బీఐఎమ్ఐ) కొనసాగింపుగా గూగుల్ ఈ టిక్ మార్కును ప్రవేశపెట్టింది.
బ్లూ టిక్ మార్క్ సాయంతో వినియోగదారులు నకిలీ అకౌంట్ల నుంచి వచ్చే ఫిషింగ్ దాడులనుంచి తమని తాము కాపాడుకోవచ్చని పేర్కొంది. ఇక బీఐఎమ్ఐను వినియోగిస్తున్న సంస్థలన్నిటీకి ఆటోమేటిక్‌గా బ్లూ టిక్ మార్క్ జారీ అవుతుంది. అయితే, ఈ టిక్ మార్క్‌ను గూగుల్ ప్రస్తుతానికి ఉచితంగానే జారీ చేస్తోంది.