మీ పెళ్లి మేం చేస్తాం... కర్ణాటకలో స్వతంత్ర అభ్యర్థుల మేనిఫెస్టోలు
- మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
- జోరుగా సాగుతున్న ప్రచారం
- ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న ఇద్దరు సోదరులు
- తమకు ఓటేస్తే పెళ్లి చేసే బాధ్యత తమదని ప్రకటన
- పెళ్లికాని యువతను ఆకర్షించేందుకు ప్రయత్నం
కర్ణాటకలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అటు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తున్నారు. కొందరు ఇండిపెండెంట్లు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న పథకాలు ప్రకటిస్తున్నారు.
మీరు మాకు ఓటేయండి... మీ పెళ్లి మేం జరిపిస్తాం అంటూ పెళ్లికాని యువతను తమ వైపు తిప్పుకునేందుకు ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రకటించారు. ఈ మేరకు మేనిఫెస్టోల్లో పేర్కొన్నారు.
ఆ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు సోదరులే. కెంపన్న కుల్లూరు, పుండలీక కుల్లూరు అనే సోదరులు ఆరభావి, గోకాక్ అనే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. తమను గెలిపిస్తే... కచ్చితంగా పెళ్లి జరిపిస్తాం అని హామీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ పెళ్లిళ్ల ఆఫర్ తో కూడిన మేనిఫెస్టోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.