నేడు బ్రిటన్ రాజు పట్టాభిషేకం... ఆనవాయతీ పాటించనున్న రిషి సునాక్
- బ్రిటన్ రాజుగా చార్లెస్-3
- నేడు అధికారికంగా కిరీటధారణ
- పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వం
- బైబిల్ పఠనం చేయనున్న రిషి
బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్-3 నేడు పట్టాభిషిక్తులు కానున్నారు. అంగరంగవైభవంగా జరగనున్న పట్టాభిషేక కార్యక్రమంలో ఆయనకు అధికారికంగా కిరీటధారణ చేయనున్నారు. ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
బ్రిటన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానులు బైబిల్ పఠించడం ఆనవాయతీగా వస్తోంది. ప్రస్తుత బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ కూడా ఈ ఆచారాన్ని పాటించనున్నారు. బైబిల్ లోని కొన్ని ఎంపిక చేసిన వాక్యాలను పఠించనున్నారు. సాటివారికి సేవలందించడం, సర్వజనులపై క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేలా ఈ బైబిల్ పఠనం ఉంటుంది.
కాగా, నేడు లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ పట్టాభిషేక కార్యక్రమం జరగనుండగా, బ్రిటన్ రాజకుటుంబీకులు, ప్రభుత్వ పెద్దలతో పాటు దేశవిదేశాల నుంచి 2 వేల మంది వరకు అతిథులు హాజరుకానున్నారు.
100 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.