ప్రియాంక చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. రేవంత్ రెడ్డి
- ఈ నెల 8న సరూర్ నగర్ యువ సంఘర్షణ సభకు ప్రియాంక
- హైదరాబాద్ డిక్లరేషన్ విడుదల చేస్తామని వెల్లడి
- కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలని రేవంత్ పిలుపు
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రియాంక గాంధీ ఈ నెల 8వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభలో ఆమె పాల్గొంటున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను రేవంత్ మీడియాకు వెల్లడించారు. ప్రియాంక పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమె చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చెప్పారు.
గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారని, అదే స్పూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్‌ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్‌లో ప్రకటిస్తామని, టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో వివరిస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వమని కేసీఆర్ ను అడగడం కాదని, ఆ ఇంటి ఉద్యోగాలు ఊడగొడితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు.