భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

  • 694 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 186 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 6 శాతం వరకు నష్టపోయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. అమెరికాలోని ప్యాక్ వెస్ట్ బ్యాంక్ కార్ప్ పతనం అంచుకు చేరుకుందనే వార్తలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 694 పాయింట్లు నష్టపోయి 61,054కి పడిపోయింది. నిఫ్టీ 186 పాయింట్లు కోల్పోయి 18,069కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.44%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.65%), మారుతి (1.43%), నెస్లే ఇండియా (1.40%), ఐటీసీ (1.02%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-5.90%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-5.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.29%), టాటా స్టీల్ (-2.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.34%).


More Telugu News