ఆటలో కోచింగ్ స్టాఫ్ జోక్యమెందుకు?.. గంభీర్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విమర్శలు

  • మైదానంలో కోహ్లీ, గంభీర్ గొడవపై తీవ్ర విమర్శలు
  • మైదానంలో జరిగే గొడవల్లో కోచ్‌లు జోక్యం చేసుకోకూడదన్న మైఖేల్ వాన్
  • ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగితే దాన్ని వాళ్లే పరిష్కరించుకోవాలని వ్యాఖ్య
ఐపీఎల్ లో లక్నో, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కోహ్లీ వర్సెస్ గంభీర్, కోహ్లీ వర్సెస్ నవీనుల్ హక్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చకు దారితీసింది. ఆటగాళ్ల తీరుపై సునీల్ గవాస్కర్, వీరేందర్ సెహ్వాగ్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు అసహనం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. గౌతమ్ గంభీర్ తీరుపై విమర్శలు చేశాడు. మైదానంలో గొడవలు జరుగుతాయని, కోచ్‌లు జోక్యం చేసుకోకూడదని చెప్పాడు.

“ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఇది కేవలం ఆట మాత్రమే. గొడవల్లో కోచ్‌లు జోక్యం చేసుకోవడం సరికాదు. కోచ్ లేదా కోచింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఎవరైనా.. ఆటలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు’’ అని విమర్శించాడు.

‘‘మైదానంలో జరిగేది మైదానంలోనే ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగితే దాన్ని వాళ్లే పరిష్కరించుకోవాలి. కోచ్‌లు డగౌట్‌లో లేదా డ్రెస్సింగ్ రూమ్‌లో వ్యూహాల గురించి ఆలోచిస్తూ ఉండాలి’’ అని వాన్ సూచించాడు.


More Telugu News