25 ఏళ్ల క్రితం విస్పర్ యాడ్ లో నటించిన స్మృతి ఇరానీ.. వీడియో
- నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ప్రకటన వీడియో పోస్ట్
- వీటిల్లో నటించడం మోడల్ కెరీర్ కు ముగింపుగా అభివర్ణన
- మహిళల రుతు శుభ్రతపై మాట్లాడడం ఎందుకు నిషేధించాలని ప్రశ్న
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ, మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతీ ఇరానీ రాజకీయాల్లోకి రాకముందు మోడల్ గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో విస్పర్ యాడ్ లో ఆమె నటించారు. అదే యాడ్ ను తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా (స్మృతిఇరానీఅఫీషియల్) లో షేర్ చేశారు. 25 ఏళ్ల క్రితం నాటి ప్రకటన కావడంతో అది చూసిన వారు, ఈమె స్మృతి ఇరానీయేనా? అన్న సందేహం వచ్చేలా ఆమె చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు.
‘‘25 ఏళ్ల క్రితం నా మొదటి ప్రకటన. అది కూడా పెద్ద కంపెనీతో. అయితే, అందులోని సబ్జెక్ట్ మాత్రం ఫ్యాన్సీ కాదు. అలాంటి ఉత్పత్తుల ప్రకటనలకు చాలా మంది దూరంగా ఉంటారు. ఎందుకంటే శానిటరీ ప్యాడ్ ప్రకటనలో నటించడం అంటే మోడల్ రంగుల ప్రపంచానికి ముగింపు పడినట్టే. కెమెరా ముందు నటించాలన్న ఉత్సాహంతో ఉన్న నేను ప్రకటనకు యస్ అని చెప్పేశాను. మహిళ రుతు సంబంధిత పరిశుభ్రతపై మాట్లాడడం ఎందుకు నిషేధించాలి? అంతే ఇంక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. (ఇన్ స్టా వీడియో కోసం)