తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామిపై కేసు నమోదు

  • ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఎఫ్ఐఆర్
  • బదులు పిటిషన్ వేయాలని పళనిస్వామికి సూచించిన మద్రాస్ హైకోర్టు
  • తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిపై కేసు నమోదయింది. 2021 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పళనిస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు మద్రాస్ హైకోర్టుకు సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఆస్తులు, విద్యకు సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వివరణపై బదులు పిటిషన్ వేయాలని పళనిస్వామికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.


More Telugu News