కోహ్లీ, గంభీర్ గొడవ చల్లార్చేందుకు యువరాజ్ సూపర్ ఐడియా!
- ఇద్దరినీ స్ప్రైట్ బ్రాండ్ కు రాయబారులను చేయాలన్న యువీ
- అప్పుడైనా ఇద్దరినీ కూల్ గా ఉంచొచ్చంటూ సరదా ట్వీట్
- లక్నో, ఆర్సీబీ మ్యాచ్ లో గొడవ పడ్డ కోహ్లీ, గంభీర్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గొడవ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆట, ఫలితం కంటే ఎక్కువగా మైదానంలో గంభీర్, కోహ్లీ గొడవ పడటమే చర్చనీయాంశమైంది.
లక్నో జట్టుకు మెంటార్ గా ఉన్న గంభీర్, భారత క్రికెట్ లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న కోహ్లీ ఒకరి మీదకు మరొకరు దూసుకెళ్లడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. తమ స్థాయిని మరిచి ఇలా ప్రవర్తించిన ఇద్దరిపై మ్యాచ్ రిఫరీ ఆ రోజే చర్యలు తీసుకున్నారు. వారి మ్యాచ్ ఫీజుల్లో వంద శాతం కోత విధించారు. వీరికి జరిమానా మాత్రమే సరిపోదని.. బీసీసీఐ ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కోహ్లీ, గంభీర్ రగడపై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్ వస్తున్నాయి. ఇద్దరి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ నెటిజన్లు రకరకాల మీమ్స్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. మైదానంలో ఒకరిపై ఒకరు నిప్పులు చిమ్ముకునేలా ఉన్న గంభీర్, కోహ్లీ గొడవను చల్లార్చేందుకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ గమ్మతైన ఐడియాతో వచ్చాడు. ఈ ఇద్దరినీ ప్రముఖ కూల్ డ్రింక్ ‘స్ర్పైట్’ తమ రాయబారులుగా ఎంచుకోవాలన్నారు. తమ బ్రాండ్ ప్రమోషన్స్ లో వీరిని ఉపయోగించుకోవాలన్నాడు. అలాగైనా ఇద్దరినీ కాస్త చల్లబరచవచ్చని సరదా ట్వీట్ చేశారు. మీరు ఏమంటారు? అంటూ గంభీర్, కోహ్లీలను ట్యాగ్ చేశాడు.