జగన్ మ్యానిప్యులేషన్ వల్లే అవినాశ్ రెడ్డి అరెస్ట్ కావడం లేదు: వర్ల

  • వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే పెద్ద మ్యానిప్యులేటర్ జగన్ అన్న టీడీపీ నేత
  • 2004కు ముందు ఏమీ లేని వ్యక్తి నేడు అత్యంత ధనవంతుడైన సీఎం అయ్యాడని వ్యాఖ్య
  • అవినాశ్ పై ఆధారాలు ఉన్నాయని సీబీఐ నివేదిక ఇచ్చిందన్న వర్ల
  • అరెస్ట్ చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ 
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకపోవడానికి సీఎం జగన్ మ్యానిప్యులేషనే కారణమని తెలుగు దేశం పార్టీ నేత వర్ల రామయ్య అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే పెద్ద మ్యానిప్యులేటర్ జగన్ అని మండిపడ్డారు. తన మేనిప్యులేషన్ వల్ల 2004కు ముందు ఏమీ లేని వ్యక్తి నేడు అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అయ్యారన్నారు. జగన్ చుట్టూ పెద్ద లాబీయింగ్ టీమ్ నడుస్తోందన్నారు.

జగన్ లాబీయింగ్ టీమ్ లో ముఖ్యులు విజయ్ కుమార్, ఓ స్వామిజీ ఉన్నారని ఆరోపించారు. అవినాశ్‌పై ఆధారాలు ఉన్నాయని సీబీఐ నివేదిక ఇచ్చినప్పటికీ... అరెస్ట్ కాకపోవడం జగన్ మ్యానిప్యులేషనే అన్నారు. పెద్దల లాబీయింగ్ తోనే అవినాశ్ రెడ్డి అరెస్టును జగన్ ఆపుతున్నారన్నారు. జగన్ మ్యానిప్యులేషన్ తో సీబీఐ ప్రతిష్ట కూడా మసకబారేలా ఉందన్నారు. అవినాశ్ ను అరెస్ట్ చేసి సీబీఐ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.


More Telugu News