సన్ రైజర్స్ బౌలర్లు సత్తా చాటితే ఇలా ఉంటుంది!

  • ఉప్పల్ లో సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 రన్స్
  • కీలక సమయాల్లో వికెట్లు తీసి కోల్ కతాకు బ్రేకులు వేసిన సన్ రైజర్స్ బౌలర్లు
కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు సమయోచితంగా రాణించారు. సొంతగడ్డ ఉప్పల్ లో జరుగుతున్న మ్యాచ్ లో, సన్ రైజర్స్ బౌలర్లు తమకు కొట్టినపిండి లాంటి పిచ్ పై సరైన ప్రదేశాల్లో బంతులు విసిరి తగిన ఫలితాన్ని రాబట్టారు. కోల్ కతా భారీ స్కోరు సాధించకుండా కట్టడి చేశారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా (42), రింకూ సింగ్ (46), ఆండ్రీ రస్సెల్ (24) భయపెట్టినా, సన్ రైజర్స్ బౌలర్లు వారిని కీలక సమయంలో పెవిలియన్ కు తిప్పి పంపారు. 

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నటరాజన్ ప్రమాదకర రింకూ సింగ్ వికెట్ తీయడమే కాదు, కేవలం మూడు పరుగులే ఇచ్చి కోల్ కతాను నిరాశకు గురిచేశాడు. అంతకుముందు, కోల్ కతా ఇన్నింగ్స్ లో ఓపెనర్ జాసన్ రాయ్ 20 పరుగులు చేశాడు. 

సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 2, నటరాజన్ 2, భువనేశ్వర్ కుమార్ 1, కార్తీక్ త్యాగి 1, కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 1, మయాంక్ మార్కండే 1 వికెట్ తీశారు. సన్ రైజర్స్ టీమ్ లో బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరికీ వికెట్ దక్కింది.


More Telugu News