ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు
  • తాజాగా 2 వేల పేజీలతో అనుబంధ చార్జిషీటు
  • స్కాంలో సిసోడియా పాత్రను వివరిస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీటు 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఈడీ అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పాత్ర వివరిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటు 2 వేల పేజీలతో సుదీర్ఘంగా ఉంది. 

లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాను ఈడీ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇటీవల ఆయన జ్యుడిషియల్ కస్టడీని మే 8 వరకు పొడిగించారు. తీహార్ జైలులో ఉంటున్న సిసోడియాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.


More Telugu News