పెళ్లి విషయంలో నాకు అర్థమైంది ఇదే: నటుడు సంపత్ రాజ్

  • నటుడిగా సంపత్ రాజ్ కి మంచి పేరు
  • 'వ్యవస్థ' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నటుడు 
  •  తన పెళ్లి గురించిన ప్రస్తావన
  • చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకోకూడదని వ్యాఖ్య

తెలుగు తెరకి తనదైన విలనిజాన్ని పరిచయం చేసిన నటుడు సంపత్ రాజ్. ఆయన వాయిస్ .. డైలాగ్ డెలివరీ .. కంటిచూపుతోనే అవతలివారిని శాసించే తీరు .. ఇవన్నీ కూడా ఆయనను స్టార్ విలన్ ను చేశాయి. ఇక హీరోయిన్ తండ్రిగా పాజిటివ్ పాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నుంచి ఇటీవల 'వ్యవస్థ' అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. 

తాజా ఇంటర్వ్యూలో సంపత్ రాజ్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. నేను సినిమాల్లోకి రావడం మా అమ్మగారికి ఇష్టం ఉండేది కాదు. కానీ నేను సక్సెస్ అయిన తరువాత ఆమె సంతోషించింది. నా సక్సెస్ ను మా ఫాదర్ చూడలేకపోయారు. ఆ బాధ మాత్రం నాలో అలాగే ఉండిపోయింది" అని అన్నారు. 

"మా అమ్మాయికి ఐదేళ్ల వయసున్నప్పుడు నాకు .. మా ఆవిడకు విడాకులు ఆయ్యాయి. పాప బాధ్యతను నేనే తీసుకున్నాను .. తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తోంది. నేను .. మా ఆవిడ కలిసి కూర్చుని మాట్లాడుకుని సామరస్య వాతావరణంలో విడిపోయాము. ఇప్పటికీ మా అమ్మాయి వాళ్ల అమ్మను కలుసుకుంటూనే ఉంటుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడమే నా విడాకులకు కారణమనే విషయం ఆ తరువాత నాకు అర్థమైంది. అనుభవం అన్నిటికంటే గొప్పది కదా" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News