రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ అగ్రహారం పేరు ఫాతిమాపురంగా ఎలా మారింది?: విష్ణువర్ధన్ రెడ్డి
- రాత్రికి రాత్రే కాలనీల పేర్లు మార్చేస్తున్నారన్న విష్ణు
- మత దురహంకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆగ్రహం
- ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి మరీ నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడి
ప్రస్తుతం కొందరు ప్రభుత్వం అండతో రాత్రికి రాత్రే కాలనీల పేర్లు మార్చేస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మత దురహంకారంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాధనంతో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి మరీ నిధులు మంజూరు చేసి, కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరులోని ఏటీ అగ్రహారం పేరును కూడా ఇలాగే మార్చాశారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రాత్రికి రాత్రే గుంటూరులో ఏటీ అగ్రహారం పేరు ఫాతిమాపురంగా ఎలా మారిందని నిలదీశారు.
"పాకిస్థాన్ జాతిపిత పేరు మనకెందుకంటే కేసులు పెడతారు. జిన్నా టవర్ పేరు మార్చండంటే జాతీయ జెండా రంగులేసి రాజకీయం చేస్తారు. వైసీపీ పరిపాలన అంటే హిందువులను అవమానించి ఇతర వర్గాలను సంతృప్తి పరచడం అన్నట్టుగానే సాగుతోంది... ఇది సిగ్గుచేటు. ఇలాంటి రాజకీయాలు చేస్తే హిందూ సమాజం ఏదీ ఉంచుకోదు... తిరిగిచ్చేస్తుందని గుర్తుంచుకోవాలి" అని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ఏటీ అగ్రహారం పేరును అలాగే ఉంచి, జిన్నా టవర్ పేరును తక్షణమే మార్చాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. లేకపోతే బీజేపీ నేతృత్వంలో హిందూ సమాజం మొత్తం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉందని విష్ణు హెచ్చరించారు.