బల్కంపేట ఎల్లమ్మ తల్లికి 2.20 కిలోల బంగారు కిరీటం సమర్పిస్తున్నాం: మంత్రి తలసాని

  • బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి విచ్చేసిన తలసాని
  • అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన వైనం
  • జూన్ 20న ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఉంటుందని వెల్లడి
  • భక్తులు సమర్పించిన బంగారంతో కిరీటం, ఆభరణాలు తయారుచేయిస్తున్నట్టు వివరణ
హైదరాబాదులోని సుప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు కిరీటం సమర్పిస్తున్నామని, దీని బరువు 2.20 కిలోలు ఉంటుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూన్ 20న బల్లంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఉంటుందని, ఎంతో వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఇవాళ బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లి ఆలయానికి తలసాని విచ్చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. 

భక్తులు మొక్కుల రూపంలో అమ్మవారికి సమర్పించిన బంగారంతో కిరీటం, ఇతర ఆభరణాలు చేయిస్తున్నామని వెల్లడించారు. ఆలయం ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తున్నామని వివరించారు. 

తన పర్యటన సందర్భంగా, ఆలయం వద్ద నిర్మించిన 34 దుకాణాలను తలసాని ప్రారంభించారు. దాతల సహకారంతో ఈ షాపులు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, దుకాణాలను చిరు వ్యాపారులకు ఉచితంగా కేటాయించామని తెలిపారు.


More Telugu News