జాబ్ ఆఫర్ తో నా ఫ్రెండ్ నే బురిడీ కొట్టించారు.. జాగ్రత్త: జెరోదా కామత్
- మొదట పార్ట్ టైమ్ పనికి కొంత ప్రతిఫలం
- తర్వాత క్రిప్టో ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ ఆశలు
- ట్రేడింగ్ కోసం బదిలీ చేసిన సొమ్ము వెనక్కి తీసుకోవడానికి లేదు
వాట్సాప్, టెలిగ్రామ్ నంబర్లకు వచ్చే జాబ్ ఆఫర్లను చూసి మోసపోవద్దని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోదా వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ హెచ్చరించారు. తన ఫ్రెండ్ ని పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ పేరుతో రూ.5 లక్షలు మోసం చేశారంటూ, అది జరిగిన తీరును ఆయన వివరించారు.
‘‘నాకు తెలిసిన వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నాడు. వాట్సాప్ లో పార్ట్ టైమ్ జాబ్ పేరుతో వచ్చిన ఆఫర్ తో ఇది మొదలైంది. కొన్ని రిసార్టులు, రెస్టారెంట్లపై నకిలీ రివ్యూలు రాయాలనే పని కల్పించారు. అనంతరం నాకు తెలిసిన వ్యక్తి బ్యాంకు ఖాతాకు రూ.30వేలు బదిలీ చేశారు. నా ఫ్రెండ్ తోపాటు అదే గ్రూపులోని ఇతరులకూ అదే పని కల్పించారు. అనంతరం మోసంలో రెండో దశ మొదలైంది.
మాక్ క్రిప్టో ప్లాట్ ఫామ్ పై ట్రేడింగ్ చేయాలని పురమాయించారు. సంబంధిత ప్లాట్ ఫామ్ కు నగదు బదిలీ చేయాలని కోరారు. అధిక రాబడులు వస్తాయని చెప్పారు. పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ తో సంపాదించిన రూ.30 వేలను బదిలీ చేస్తే రిస్కే ఉండేది కాదు. కానీ, ఆశతో మరింత నగదును మాక్ క్రిప్టో ప్లాట్ ఫామ్ కు బదిలీ చేశాడు. దీనికి అదే గ్రూపులోని ఇతరులు తాము భారీ లాభాలను ఆర్జించామని చెప్పడమే ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చు.
అయితే, యాడ్ చేసిన బ్యాలన్స్ ను వెనక్కి తీసుకోవడానికి అనుమతించలేదు. వెనక్కి తీసుకోవాలంటే కనీస ట్రేడ్స్ చేయాలని సూచించారు. ట్రేడ్ చేయాలంటే అదనంగా డబ్బు యాడ్ చేయాలి. అలా రూ.5 లక్షలు యాడ్ చేయడం జరిగింది. కానీ, వాటిని విత్ డ్రా చేసుకుందామన్నా అదే నిబంధన. మరిన్ని ట్రేడ్ లు చేయాలి. మరింత మొత్తాన్ని లోడ్ చేయాలి. దీంతో అది స్కామ్ అని అప్పుడు అర్థం చేసుకొని పోలీసులను ఆశ్రయించాడు" అని జెరోదా నితిన్ కామత్ వివరించారు.