ఆ సర్జరీతో నా ముఖం మొత్తం మారడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా
- కెరీర్ ఆరంభంలో ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నానన్న ప్రియాంక
- సర్జరీ తర్వాత గదిలోంచి బయటికి వచ్చేందుకు భయపడ్డానని వెల్లడి
- హాలీవుడ్ లో సత్తా చాటుతున్న బాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన తర్వాత హాలీవుడ్ లో అడుగు పెట్టి గ్లోబల్ స్టార్ గా మారింది ప్రియాంక చోప్రా. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. క్వాంటికోతో హాలీవుడ్ లో అరంగేట్రం చేసిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన తాజా సిరీస్, సిటాడెల్ లో నటనతో ప్రశంసలు అందుకుంటున్న ప్రియాంక గతంలో తన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న నాటి రోజులను గుర్తు చేసుకుంది. ఆ శస్త్ర చికిత్స బెడిసికొట్టడంతో తాను తీవ్రమైన బాధ, డిప్రెషన్ లోకి వెళ్లినట్టు వెల్లడించింది.
2000లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకొని భారత్ కు తిరిగొచ్చిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వైద్యుడిని సంప్రదించినట్టు తెలిపింది. తీవ్రమైన జలుబు, తలనొప్పితో ఇబ్బందిపడ్డ తాను శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని, అదే తన జీవితంలో చీకటి దశ అవుతుందని అనుకోలేదని చెప్పింది. సర్జరీ తర్వాత తన ముఖం పూర్తిగా మారిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, గది నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డానని ఓ హాలీవుడ్ షోలో వెల్లడించింది.
‘సర్జరీ తర్వాత నా ముఖం పూర్తి భిన్నంగా కనిపించింది. దాంతో చాలా నిరాశకు గురయ్యాను. ఎందుకంటే నా నట జీవితం అప్పుడే మొదలైంది. ఈ కారణంగా మూడు సినిమాల నుంచి తొలగించారు. నేను చాలా భయపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. నేను నీతోనే ఉన్నానంటూ ధైర్యం చెప్పారు’ అని తెలిపింది.
ఆ సమయంలో బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ తనకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని చెప్పింది. ‘ఆ చిత్రంలో నేను కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ, నన్ను సహాయక పాత్రకు మార్చారు. ఆ చిత్ర నిర్మాత (అనిల్ శర్మ) చాలా మంచి వారు. నాకెంతో సాయం చేశారు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాలో మనోధైర్యాన్ని నింపారు. నీది చిన్నపాత్రే కావొచ్చు.. నీ టాలెంట్ మొత్తం చూపించు అన్నారు. నేను అలానే చేసి పరిశ్రమలో నిలదొక్కుకున్నా’ అని ప్రియాంక వెల్లడించింది.