తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన.. దేవినేని ఉమ అరెస్ట్
- ధాన్యాన్ని, మొక్కజొన్నను ప్రభుత్వమే కొనాలని దేవినేని నిరసన
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు
- ఎమ్మెల్యే అసమర్థత వల్లే రైతులు నష్టపోయారన్న ఉమ
తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని, మొక్కజొన్నను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని మైలవరం మార్కెట్ యార్డు వద్ద ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం సాయంత్రం నిరసనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కనిపించింది.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసమర్థత వల్ల రైతులు నష్టపోయారని, జిల్లా వ్యాప్తంగా ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా మార్కెట్ లోనే ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు టార్ఫాలిన్ ఇవ్వకపోవడంతో మరింత నష్టపోయారన్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని ఉమ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.