మరో నాలుగు బంతులు ఆడితే ఇన్నింగ్స్ ముగిసేదే.. లక్నో-చెన్నై మ్యాచ్‌ను ఆపేసిన వాన
- టాస్ గెలిచి లక్నోకు బ్యాటింగ్ అప్పగించిన చెన్నై
- చెన్నై బౌలర్ల దెబ్బకు లక్నో బ్యాటర్ల విలవిల
- ఒంటరి పోరాటం చేస్తున్న ఆయుష్ బదోని
లక్నో సూపర్ జెయింట్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. లక్నో ఇన్నింగ్స్ ముగియడానికి నాలుగు బంతుల ముందు అంటే.. 19.2 ఓవర్ల వద్ద వర్షం పడడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి లక్నో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభం కలిసి రాలేదు. 18 పరుగులకే ఓపెనర్ కైల్ మేయర్స్ (14) వికెట్‌ను కోల్పోయిన లక్నో 27 పరుగుల వద్ద మనన్ ఓహ్రా (10), స్టాండిన్ కెప్టెన్ కృనాల్ పాండ్యా (0) వికెట్లను కోల్పోయింది. దీంతో ఒత్తిడిలో కూరుకుపోయిన జట్టుపై చెన్నై బౌలర్లు మరింత ఒత్తిడి పెంచారు. ఆదుకుంటాడనుకున్న మార్కస్ స్టోయినిస్ (6) కూడా విఫలమయ్యాడు. నికోలస్ పూరన్ మాత్రం 20 పరుగులతో కాస్తంత పరవాలేదనిపించాడు.
చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ, మహేశ్ తీక్షణ, మతీశా పథిరన తలా రెండు వికెట్లు తీసుకున్నారు. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి లక్నో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆయుష్ బదోని 59 (33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు.