రజనీకాంత్ పర్ఫెక్ట్.. అన్నీ నిజాలే మాట్లాడతారు: జగపతిబాబు

రజనీకాంత్ పర్ఫెక్ట్.. అన్నీ నిజాలే మాట్లాడతారు: జగపతిబాబు
  • ఇటీవల చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రజనీకాంత్
  • రజనీపై విమర్శల వర్షం కురిపించిన వైసీపీ మంత్రులు, నేతలు
  • రజనీ చాలా పద్ధతిగా మాట్లాడతారన్న జగపతిబాబు
ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో రజనీపై వైసీపీ మంత్రులు, నేతలు వరుసకట్టుకుని విమర్శలు గుప్పించారు. 

ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో ఇదే అంశంపై జగపతిబాబుకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా జగపతిబాబు మాట్లాడుతూ... ఆ గొడవ గురించి తనకు తెలియదని.. అయితే, రజనీకాంత్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పారు. చాలా పద్ధతిగా మాట్లాడతారని, నిజాలే మాట్లాడతారని అన్నారు. రజనీని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారనే దానిపై స్పందిస్తూ... మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.


More Telugu News