సీనియర్ స్టార్స్ గురించి ఖుష్బూ ఏమందంటే ..!
- 1980లలో ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ
- గ్లామరస్ హీరోయిన్ గా తమిళనాట క్రేజ్
- టాలీవుడ్ స్టార్స్ గురించి తన అభిప్రాయం
- కోలీవుడ్ స్టార్స్ గురించిన ప్రస్తావన
1980లలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో ఖుష్బూ ఒకరు. 'కలియుగ పాండవులు' సినిమాతో తొలి ప్రయత్నంలోనే ఆమె భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత నాగార్జునతో 'కెప్టెన్ నాగార్జున' చేశారు. అలా తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఖుష్బూ, ఆ తరువాత టాలీవుడ్ వైపు తిరిగి చూడలేనంతగా బిజీ అయ్యారు.
తాజా ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ, తాను నటించిన హీరోలను గురించి ప్రస్తావించారు. చిరంజీవి గారు లెజెండ్. సెట్లో ఆయనపడే కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. 'ఆల్రెడీ నేను మెగాస్టార్ .. నేను ఏం చేసినా జనాలు చూస్తారు' అని ఆయన అనుకోరు. ఎప్పటికప్పుడు కొత్తగా ఏం చేయాలా అని ఆలోచన చేస్తుంటారు" అన్నారు.
"నాగార్జునగారితో ఫస్టు మూవీగా 'కెప్టెన్ నాగార్జున' చేశాను. అప్పటికే ఆయన చాలా స్టైలీష్ గా ఉండేవారు. ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ తెరపై ఆయనతో రొమాన్స్ చేయాలని కోరుకుంటారు. ఇక రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటించాను. ఆయనను నేను 'బావా' అని పిలుస్తుంటాను. పవన్ కల్యాణ్ గారి విషయానికి వస్తే చాలా తక్కువగా మాట్లాడతారు .. ఆయన వ్యక్తిత్వం గొప్పది. కోలీవుడ్ లో కమల్ గారు నా స్వీట్ హార్ట్. ఇక రజనీ సార్ గురించి మాట్లాడటానికి మాటలు చాలవు" అని చెప్పుకొచ్చారు.