అండగా ఉంటా: రెజ్లర్లకు పీటీ ఉష భరోసా

  • రెజ్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెజ్లర్ల ఆందోళన
  • కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధర్నా
  • రెజ్లర్లను కలిసిన పీటీ ఉష
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత 11 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వీరు ధర్నాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష వారిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

పీటీ ఉషతో భేటీ అనంతరం రెజ్లర్ భజరంగ్ పూనియా మాట్లాడుతూ... రెజ్లర్లకు అండగా ఉండి న్యాయం చేస్తానని పీటీ ఉష తమతో చెప్పారని అన్నారు. సమస్యను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. 



More Telugu News