అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- ఏప్రిల్ 28న భారీ అంచనాలతో విడుదలైన ‘ఏజెంట్’
- ఫ్లాప్ టాక్ తో పడిపోయిన కలెక్షన్స్.. థియేటర్ల ఖాళీ
- మే 19న ఓటీటీలోకి మూవీ.. వెల్లడించిన సోనీ లీవ్
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘ఏజెంట్’ సినిమా ఊహించని పరాజయాన్ని చవిచూసింది. అఖిల్ అక్కినేని హీరోగా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. నెగటివ్ టాక్ తో మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో చాలా థియేటర్స్ లో నుంచి ఈ సినిమాని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
థియేటర్స్ లో ఇక రన్ అవడం కష్టమని భావించిన మేకర్స్.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సోనీ లీవ్ సంస్థ మే 19న ఓటీటీలో ఏజెంట్ మూవీని స్ట్రీమ్ చేయనున్నట్లు వెల్లడించింది. అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించారు. అయితే విడుదలైన నాలుగు రోజులకే అనిల్ సుంకర సంచలన ప్రకటన చేశారు. ‘‘ఈ సినిమాకి చాలా పెద్ద తప్పు చేశాం. అది బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లడమే’’ అని ట్వీట్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, రావు రమేష్, డినో మోరియో, సాక్షి వైద్య తదితరులు ‘ఏజెంట్’ లో ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ అయింది.