నాకు ఇప్పుడు బాధ కలిగిస్తున్న విషయం ఇదే: సీనియర్ నటి వై.విజయ
- కెరియర్ ఆరంభంలో హీరోయిన్ గా చేసిన వై.విజయ
- ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ
- ఒక దశలో సీరియల్స్ మాత్రమే చేసిన వై.విజయ
- గత వైభవాన్ని గురించిన ప్రస్తావన
తెలుగు తెరను వై.విజయ కొంతకాలం పాటు ఊపేశారు. రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రలను ఆమె ఎక్కువగా చేశారు. ఆమె చేసిన కొన్ని పాత్రలు ఆనాటి ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. మధ్యలో కొంతకాలం పాటు సీరియల్స్ పై ఎక్కువగా ఫోకస్ చేసిన వై.విజయ, ఆ తరువాత మళ్లీ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు.
తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వై. విజయ మాట్లాడుతూ, "13 ఏళ్ల వయసులోనే నేను సినిమాల్లోకి వచ్చాను. 'తల్లిదండ్రులు' సినిమాలో శోభన్ బాబుగారికి హీరోయిన్ గా చేశాను. 15 సినిమాలలో హీరోయిన్ గా చేసిన నేను, ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా చేశాను. తమిళంలో బాలచందర్ గారు చేసిన 'మన్మథ లీలై'తో అక్కడ ఫుల్ బిజీ అయ్యాను" అని అన్నారు.
ఆ తరువాత కాలంలో చేసిన 'మంగమ్మగారి మనవడు' .. 'మా పల్లెలో గోపాలుడు' సినిమాల నుంచి ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు. అప్పట్లో కేరక్టర్ ఆర్టిస్టులకు మంచి పాత్రలు పడేవి. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్టునైనా అలా వెనుక వరుసలో నిలబెట్టేస్తున్నారు. అలాంటప్పుడు మాత్రం నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.