ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా నెం.1
- తాజా టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ
- ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా
- టీమిండియా ఖాతాలో 121 రేటింగ్ పాయింట్లు
- ఆసీస్ కు 116 పాయింట్లు
గత కొంతకాలంగా టెస్టుల్లో నిలకడగా విజయాలు సాధిస్తున్న టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెం.1 ర్యాంకును కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా జట్టు గత 15 నెలల కాలంగా టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రపీఠంపై కొనసాగుతోంది. అయితే, ఇటీవల టీమిండియా... ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో ఓడించింది. దాంతో టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా రేటింగ్ పాయింట్లు 121కి పెరిగాయి. అదే సమయంలో ఆసీస్ రేటింగ్ పాయింట్లు 116 మాత్రమే.
కాగా, భారత్, ఆస్ట్రేలియా జట్లు ఈ ఏడాది వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకు లండన్ లోని ఓవల్ మైదానంలో జరగనుంది.