ఎన్నికల్లో పోటీపై మహారాష్ట్ర పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం
- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో చర్చించిన కేసీఆర్
- 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు శిక్షణా శిబిరాల ఏర్పాటు
- 288 నియోజకవర్గాల్లో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టేలా కేసీఆర్ చర్యలు
మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నేతలతో ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ నెల 8, 9 తేదీలలో మహారాష్ట్ర పార్టీ నేతలకు శిక్షణా శిబిరాలు ఉంటాయని తెలిపారు. మే 10వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు మహారాష్ట్రలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి కావాలని నేతలకు సూచించారు. 288 నియోజకవర్గాల్లో పార్టీ విస్తరణపై నేతలు దృష్టి పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.
అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొంటాం
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మామూలు ధాన్యానికి ఇచ్చిన ధరనే తడిసిన ధాన్యానికి ఇస్తామన్నారు. యాసంగి వరికోతలు మార్చి లోపు జరిగే విధంగా ఎలాంటి విధానాలు అవలంబించాలో అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల దృష్ట్యా వరికోతలు మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని చెప్పారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో నష్టాలు జరగకుండా అధికారులు, రైతులు ముందస్తు అవగాహన ఏర్పరచుకోవాలన్నారు.